జడ్చర్ల: శివాలయం ధ్వంసం ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు
బాలానగర్ మండలం మొదంపల్లి శివాలయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలోనీ దేవాలయాలపై ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఘటనకు కారకులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.