జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా దళారుల చేతిలో రైతులు మోసపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతుల ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా మహిళా సంఘాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.