మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థాయిని స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్ కు పెంచాలని శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనురుధ్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కోరారు. మార్కెట్ కమిటీ స్థాయిని పెంచడంతో పాటు తథనుగుణంగా సిబ్బంది, సౌకర్యాలు మెరుగుపరచాలని, రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఐదు మార్కెట్లలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ ఒకటి అని పేర్కొన్నారు.