మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును అక్టోబర్ 28 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 28 వరకు ఆయా సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. రూ. 300 ఫైన్ తో నవంబర్ 3వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు.