మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు అండగా నిలిచేది బీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న రూ. 18, 500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ఈఆర్సీ ఎదుట వాదనలు వినిపించి బీఆర్ఎస్ ఆపివేయించారు.