జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మోదంపల్లి గ్రామంలో శనివారం రాత్రి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఓబీసీ ఛైర్మన్ తిరుపతి సొంత ఖర్చుతో నూతన విగ్రహ ఏర్పాటుకు మంగళవారం హామీ ఇచ్చారు. కులమత భేదాలు చూపకుండా గ్రామస్థులు సోదరభావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.