పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉద్దాల కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి పాదరక్షలను ఊరేగించడాన్నే ఉద్దాల ఉత్సవమంటారు. దేవస్థానానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్డెమాన్ నుంచి ఉత్సవం ప్రారంభం కానుంది. ఉద్దాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.