ఎంపీ డీకే అరుణ శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రభుత్వ అధికారిక సమావేశంలో పాల్గొంటారన్నారు. శనివారం ఉదయం 10: 30గంటలకు జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణా కమిటీ సమావేశానికి ఎంపీ హాజరవుతారని పేర్కొన్నారు.