మహబూబ్ నగర్ జిల్లా & రూరల్ మండలం రాంచద్రాపురంలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ ను కలసి సర్వే విధానాన్ని మంగళవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ఏఒక్క ఇంటిని వదలకుండా కుటుంబ సభ్యుల వివరాలు మరియు కులము, ఉప కులం తప్పకుండా నమోదు చేయాలి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమగ్ర కుల గణన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.