కౌకుంట్ల మండలం కేంద్రంలోని ప్రధాన సమస్య రైల్వే అండర్ పాస్ పై శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. త్వరలోనే రైల్వే జీఎంతో సమస్యను తీసుకెళ్తానని.. పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అంగన్ వాడి కేంద్రాలకు శాశ్వత భవనాలను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిషన్ రావు, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.