మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం నుంచి నిర్వహిస్తున్న రైతు పండుగ సభ స్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను, హెలిప్యాడ్ ను, రైతు అవగాహన సదస్సుల స్టాల్స్ ను బుధవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి రూ. 76,000 కోట్ల నిధులు కేటాయించిందన్నారు.