కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం కనాయిపల్లి కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి జ్వాలా తోరణం ఏర్పాటు చేశారు. భక్తులు, ఆలయ అర్చకులు ఖడ్గాలు పాడుతూ తోరణాన్ని వెలిగించారు. భక్తులు జ్వాలా తోరణం కింది నుంచి నడిచారు. ఇలా నడవడంతో శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.