సీఎం రేవంత్ కు కేసీఆర్ భయం పట్టుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు.కేసీఆర్ కు రేవంత్ చాలా తేడా ఉందని అన్నారు. బుధవారం కురుమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని అన్నారు. 42 లక్షల మందికి అని చెప్పి కేవలం 22 లక్షల మంది రైతులకే మాఫీ చేసి, పైగా తనను రాజీనామా చేయమంటున్నారని అన్నారు.