దేవరకద్ర రైల్వేస్టేషన్ ను మంగళవారం డివిజనల్ రైల్వే మేనేజర్ సందర్శించారు. దేవరకద్రలోని రైల్వే గేట్ ముసివేయడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ నాయకులు వివరించారు. రైల్వే అండర్ పాస్ నిర్మాణం త్వరగా చేయాలని, రైల్వే స్టేషన్ లో వివిధ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపేవిధంగా చూడాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కొండా గోవర్ధనరెడ్డి, కొండా అంజన్ కుమార్ రెడ్డి, ఫరూక్, తదితరులు పాల్గొన్నారు.