జోగులాంబ గద్వాల జిల్లాలో దివిటి పల్లి రైతు వేదిక వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. బిఆర్ఎస్ నాయకులు కావాలని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ, రైతులను కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారు దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తూ, రైతును గోసకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు.