అలంపూర్ మున్సిపాలిటీకి చెందిన పాస్టర్ ఎలీషా గుండెపోటుతో బుధవారం మరణించారు. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అక్కడకు వెళ్లడం జరిగినది. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దేవరాజ్, కాశీం, మనోహర్, అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.