మహారాష్ట్ర బస్సు ప్రమాద మృతులకు ఆదివారం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనలో 25 మంది చనిపోగా, ఒకరి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 24 మృతదేహాలకు బుల్దానాలో స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయని, డీఎన్ఏ
ఫలితాలు వచ్చే నాటికి చాలా టైం పడుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.