తెలంగాణ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఎంతగానో యాక్టివ్గా ఉండే లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి తన పార్టీ మార్పుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వాలని మీడియా కోరగా.. ‘నేను పార్టీ మారలేదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అని అనడంతో పార్టీ మార్పు ఖాయమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.