TG: ఖమ్మం జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూడిదంపాడు గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఉదయ నగర్ కు చెందిన తేజావత్ విజయ్ (23) భూక్య, వినోద్ (24) వాహనంపై ఇల్లందు వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.