టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుడిగా రికార్డులకెక్కారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంతో మస్క్ సంపద భారీగా పెరుగుతోంది. ఎన్నికల రోజు నుంచి టెస్లా స్టాక్ 40% పెరగ్గా, నిన్న ఒక్కరోజే 3.8% ఎగబాకింది. ట్రంప్ కార్యవర్గంలో మస్క్ కీలక బాధ్యతలు చేపట్టనుండటం సంపద పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.