పచ్చి కొత్తమీర తినడం గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలో ఫైబర్, కార్బోహైడ్రేట్, మినరల్స్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వాటితో పాటు ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, పొటాషియం, విటమిన్-సీ కూడా ఉంటాయి. ప్రతి రోజూ పచ్చి కొత్తిమీర తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయని, రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని, అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.