మహారాష్ట్రలో ఎన్టీయే కూటమి భారీ మెజార్టితో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం పదవిపై దేవేందర్ ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారీ విజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి ఎవరనేది మూడు పార్టీల నిర్ణయం మేరకు ఉంటుందని అన్నారు. ఇది ఏ ఒక్కరి విజయమో కాదు.. అందరి సమిష్టి కృషి అని కొనియాడారు. మహా వికాస్ అఘాడీ అసత్యాలను ప్రజలు తిప్పికొట్టారని దుయ్యబట్టారు.