మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. తెలంగాణలోని సూర్యాపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్త బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి గతంలో పరిచయం ఉన్న ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబసభ్యులు ఆగ్రహంతో నిందితుడిపై కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో నిందితుడు తనని విడిచిపెట్టమని ప్రాదేయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.