తెలంగాణ అభివృద్ధికి సహకరించండి: సీఎం రేవంత్

85பார்த்தது
పరభాషా జ్ఞానం సంపాదించాలి.. కానీ మన భాషను గౌరవించాలని సీఎం రేవంత్ సూచించారు. హైదరాబాద్‌ HICC వేదికగా 3 రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 'రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి' అని కోరారు.

தொடர்புடைய செய்தி