తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్లపై శుక్రవారం CM రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు.