ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని MEA పేర్కొంది. ఈ క్రమంలో తటస్థ వేదికపై ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలని టీమిండియా హైబ్రిడ్ పద్ధతిని ప్రతిపాదించింది. అయితే, భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని శుక్రవారం పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.