ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు (వీడియో)

1539பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోపాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారణాసి-శక్తినగర్ ప్రధాన రహదారిపై ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి క్షతగాత్రులను రక్షించారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி