మరో రసవత్తరమైన ఎన్నికకు తెలంగాణ వేదిక కాబోతోంది. కరీంనగర్ ఎమ్మెల్సీ పదవికాలం ముగియనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవిపై దృష్టి సారించాయి. ఓ వైపు ప్రధాన పార్టీలు అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. మరోపక్క స్వతంత్య్ర అభ్యర్థులు పోటీకి సిద్దమవుతున్నారు. టిక్కెట్ఇస్తే పార్టీల తరపున పోటీ చేయడం లేదంటే.. స్వతంత్య్రంగా పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. దీంతో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి.