దేశంలో వరుస బాంబు బెదిరింపు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే పలు పాఠశాలలతో పాటు విమానయాన సంస్థలకు ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఢిల్లీలోని పలు ప్రైవేట్ స్కూళ్లకు కొందరు ఆగంతకులు.. ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. తనిఖీలు నిర్వహించారు. ఈ బెదిరింపులు ఫేక్ అని.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.