TG: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని అక్రమాలకు పాల్పడిన వారంతా తప్పించుకునేందుకు కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పెద్దలు వారిని చేర్చుకునేందుకు అంగీకరించలేదు. దాంతో వారంతా ప్రత్యామ్నాయం వేటలో పడ్డారు. ఈ క్రమంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో చేరడమే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరిస్తుండడంతో పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబుతో రేవంత్‌కు చెప్పిస్తే తమకు ఢోకా ఉండబోదని కొందరి ఆలోచన.