మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ-శివసేన కూటమితో కలిసి ఆయన ప్రభుత్వంలో చేరారు. ఆయనతోపాటు ఎన్సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్బల్ కూడా
బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి.