సిర్పూర్: పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి
కరీంనగర్ డైరీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ సిహెచ్. రాజేశ్వర్ రావును సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగజ్ నగర్లో బల్క్ మిల్క్ కూలింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తే పాడి రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ త్వరలోనే తమ బృందం పర్యటన చేస్తుందన్నారు.