తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మకు కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం నివాళులు అర్పించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధితో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శప్రాయం అని పేర్కొన్నారు.