ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనందున ప్రాజెక్టులోకి 346 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 697. 250 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వకు 886, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.