కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను శనివారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రాజెక్టులో 695 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 148 క్యూసెక్కుల వరద నీరు చేరగా ఎడమ కాలువ ద్వారా 78, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.