కాలానుగుణ వ్యాధులు నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి సూచించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా తాంసి, తలమడుగు కేజీబీవీలను ఆమె సందర్శించి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాలల హక్కులు, హెల్ప్ లైన్ నంబర్లు, పరిశుభ్రత, బేటి బచావో బేటి పడావో, చెడు అలవాట్లు, తదితర వాటిని వివరించారు. సిబ్బంది కోటేశ్వర్, నిఖిల్ ఉన్నారు.