తాంసీ మండలం పొన్నారి సమీపంలో చేపడుతున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ ఉష్కం రఘుపతి పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ఆయన వెంటనే నాందేడ్ డివిజన్ రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.