రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే తలమడుగు మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని ఖోడద్ గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే తీరని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకట్ రావు, తదితరులున్నారు.