గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం నేరేడుగొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చొడ మాజీ ఎంపీపీ ప్రీతం రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.