నేరడిగొండ మండలంలోని బోరిగం గ్రామంలో ప్రజలు తమ జీవనాన్ని బుధవారం నుంచి చిమ్మ చీకటిలో గడుపుతున్నారు. భారీ వరద నీరు చేరడంతో నిన్న రెండు గంటల సమయంలో బోరిగం సమీపంలో ఉన్న ట్రాన్స్ఫారం కుప్పకూలిపోవడంతో ఎటువంటి విద్యుత్ సరఫరా కాకుండా చాలా వరకు స్తంభాలు విరిగిపోవడం వలన ఊరు మొత్తం చిమ్మ చీకటిగా మారిపోయింది అని గురువారం అక్కడి స్థానికులు తెలిపారు.