భీంపూర్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మండల సరిహద్దులోని గుబిడి గ్రామంలో సర్వే నమోదు ప్రక్రియను ఎంపీడీవో గోపాల కృష్ణారెడ్డి ఆదివారం పరిశీలించారు. సర్వే నమోదును జాగ్రత్తగా నిర్వహించాలని, తప్పులు లేకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాలలో సర్వే నమోదు ప్రక్రియను తాసిల్దార్ నలందప్రియ సైతం పర్యవేక్షించారు.