ఈనెల 28న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాశెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం, సీఐటీయూ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ రాజ్యసభ సభ్యులు బృందాకారత్ హాజరుకానున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పేర్కొన్నారు. బుధవారం భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. మాధవరావు విజ్ఞాన కేంద్రం భవిష్యత్తు ఉద్యమాలకు కేంద్రంగా మారనున్నదని మల్లేష్ తెలిపారు.