సి ఐ టి యు ఆధ్వర్యంలో మేనేజర్ కి మెమోరాండం అందజేత

447பார்த்தது
సి ఐ టి యు ఆధ్వర్యంలో మేనేజర్ కి మెమోరాండం అందజేత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో వెట్టి చాకిరి చేస్తూ కడు నిరుపేదలు గా బ్రతుకుతున్నారని వీరికి కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని మున్సిపల్ కార్యాలయంలో సి ఐ టి యు ఆధ్వర్యంలో మేనేజర్ కి నాయకులు మెమోరాండం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు కార్మికులంత పర్మనెంట్ అయి బ్రతుకులు మారుతాయని ఆశతో ఎదురు చూసిన చివరికి నిరాశే మిగిలిందని ప్రజల ఆరోగ్య పరిరక్షణ కొరకు మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలు లెక్కచేయకుండా పట్టణ పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్వరాష్ట్రంలో పదకొండవ పిఆర్సిలొ మున్సిపల్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుడు అనారోగ్యంతో మరణించిన ఆయిల్ల బానేష్ ఇంజనీరింగ్ సెక్షన్ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులకు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులకు ఇన్సూరెన్స్ బీమా మరియు కార్మికులందరికీ ఇంజనీరింగ్ సెక్షన్ తో సహా పనిముట్లు సామాగ్రి అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు అధ్యక్షుడు అబ్బోజు రమణ, సిఐటియు జిల్లా కార్యదర్శి దాగం రాజారాం, జిల్లా అధ్యక్షులు ఎస్.కె యాకుబ్, జిల్లా కార్యదర్శి గొడిసెల చంద్రమొగిలి లు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி