తాండూర్ మండలంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పూర్తిగా విఫలమయ్యారని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ విమర్శించారు. తాండూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో జూనియర్ కళాశాల తీసుకురావడంలో గత ఎమ్మెల్యే మాదిరిగానే ప్రస్తుత ఎమ్మెల్యే కూడా విఫలమయ్యారని పేర్కొన్నారు.