సింగరేణి విధులతో పాటు క్రీడలకు కూడా కొంత సమయాన్ని కేటాయించాలని బెల్లంపల్లి ఏరియా ఇన్ ఛార్జ్ జిఎం నరేందర్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి క్రీడా మైదానంలో ఏరియా స్థాయి బాల్, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు. కోల్ ఇండియా స్థాయిలో కూడా రాణించి బెల్లంపల్లి ఏరియాకు పేరు తీసుకురావాలని సూచించారు.