రెబ్బెన మండలం ఖైరుగుడా ఓపెన్ కాస్ట్ లో మట్టిని తరలిస్తుండగా బుధవారం టీటీసి ట్రాన్స్ పోర్ట్ లారీ అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో డ్రైవర్ మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను గోలేటి డిస్పెన్సరీకి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ కార్మికుని పరామర్శించారు. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ. కార్మికునికి మెరుగైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు.