ఉత్సాహంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

65பார்த்தது
ఉత్సాహంగా జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
ఆదిలాబాద్ రూరల్ మండలం చందా (టీ) ప్రభుత్వ పాఠశాలలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జావెలిన్ త్రో, రన్నింగ్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி