ఉపాధ్యాయులు విద్యాసామర్ధ్యాల పెంపుదలకు కృషి చేయాలని డీఈవో ప్రణీత అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ (2) లో ఆదిలాబాద్ (అర్బన్), మావల మండలాలలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పాఠశాల సముదాయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఈవో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.