రేపు పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన

67பார்த்தது
రేపు పీఎం విశ్వకర్మ  పథకంపై అవగాహన
ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంపై ఈ నెల 12న అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజలింగు ఒక ప్రకటనలో తెలిపారు. చేతివృత్తుల ఆధారంగా జీవిస్తున్న బీసీ కులస్థులకు ఆర్థిక సాయం అందించే ఈ పథకం విధివిధానాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ సంఘాల నాయకులు ఉదయం 10. 30 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி