ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు గుంటూరు డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు ఫొటోను ఫేస్‌బుక్‌లో మార్ఫింగ్ చేసి పెట్టారని పేర్కొన్నారు. సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టిన వెంకటరామిరెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు.